కేంద్రంలో కర్ణాటక పాలసీ!


Sun,May 19, 2019 02:47 AM

Master of Coalition Politics Sonia Gandhi May Step in With Advantage UPA Formula

-మోదీని గద్దెదింపడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం
-అవసరమైతే ప్రధాని పదవి వదులుకునేందుకూ సిద్ధం
-ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇచ్చే యోచనలో సోనియాగాంధీ
-అధికార పీఠంపై కన్నేసిన మమతాబెనర్జీ, మాయావతి
న్యూఢిల్లీ: ఈ నెల 23న ఏం జరుగుతుంది? మన దేశానికి కాబోయే కొత్త ప్రధాని ఎవరు? మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా? కాంగ్రెస్ అద్భుతాలు సృష్టిస్తుందా? ప్రాంతీయ పార్టీలు ఏకమై కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా?.. ఇలా పలు ప్రశ్నలు. కేంద్రంలో సంకీర్ణ ప్రభు త్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువని, సర్వేలు, నిపుణులు, విశ్లేషకులు అంటున్న నేపథ్యం లో.. కాంగ్రెస్ వైఖరి కీలకం కానున్నది. తొలి నుంచీ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నా.. మోదీని గద్దె దింపడానికి అవసరమైతే ప్రధాని పదవి వదులుకుంటాం అని ఆ పార్టీ నేతలిస్తున్న ప్రకటనలు రాజకీయంగా కొత్త వ్యూహాలకు తెరలేపుతున్నది. కర్ణాటక తరహా విధానం అమలుకూ కాంగ్రెస్ సిద్ధమవుతుండటం ప్రాంతీయ పార్టీల నేతల్లో ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి వంటి నేతల ఆశలు చిగురిస్తున్నాయి.

ఏం జరుగొచ్చంటే..?

ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా 272 సీట్లు సాధించాలి. రాజకీయ విశ్లేషకుల అంచ నా ప్రకారం 23న ఫలితాల వెల్లడి తర్వాత దేశంలో 3 రకాల పరిస్థితులు ఉండొచ్చు.
1. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సంపూర్ణ మెజార్టీ దక్కడం.
2. ఎన్డీయే 230 సీట్ల వరకు వచ్చి ఆగిపోవడం. ఈ దశలో ఎన్డీయే, యూపీఏకు సమదూరం పాటిస్తున్న టీఆర్‌ఎస్, వైసీపీ, బీజేడీ, ఏఐడీఎంకే వంటి పార్టీలు కీలకం.
3. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల మహాకూటమి సంపూర్ణ మెజార్టీ సాధించడం.
ఏది ఏమైనా అత్యధిక స్థానాలు సాధించే పార్టీగా బీజేపీ నిలుస్తుందనేది సుస్పష్టం. ఆ పార్టీకి 180-190 వరకు సీట్లు వస్తాయని అంచనా. కాంగ్రెస్ పార్టీ 120-130 మధ్య ఆగొచ్చంటున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. మరోవైపు ప్రధాని మోదీని గద్దెదింపడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు కదుపుతున్నది. అవసరమైతే ప్రధాని పదవి వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవల అన్నారు.

కుమారస్వామి ఎవరో?

సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్న బలమైన అంచనాల నేపథ్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంలో ఎక్కడా కనిపించని సోనియా.. చివరిదశలో రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అవసరమైతే ప్రధాని అయ్యే అవకాశాన్ని ప్రాంతీయ పార్టీలకు ఇచ్చి, తాము వెనుకుండి నడిపించాలని సోనియాగాంధీ భావిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో చిన్నాచితకా పార్టీలు ఎక్కువ సంఖ్యలో ఉండే కన్నా.. ఒకటి రెండు పెద్ద పార్టీలు ఉంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆమెకు తెలుసు. ఇప్పటికే యూపీఏ-1, యూపీఏ-2 సంకీర్ణ ప్రభుత్వాలను నడిపించిన అనుభవం ఆమెకు ఉన్నది. కాబట్టి ఈసారి హంగ్ పరిస్థితులు ఏర్పడితే ప్రధాని అవకాశాన్ని అత్యధిక స్థానాలు గెలుచుకునే ప్రాంతీయ పార్టీకి ఇస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలోని ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీ, ఎస్పీ-బీఎస్పీ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం మాయావతి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles