యూపీలో సామూహిక లైంగికదాడులు

Thu,December 5, 2019 12:55 AM

-ఫిరోజాబాద్‌లో యువతిపై.. మీర్జాపూర్‌లో బాలికపై అఘాయిత్యం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై లైంగికదాడు లు కొనసాగుతున్నాయి.తాజాగా మీర్జాపూర్, ఫిరోజాబాద్‌లో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. మీర్జాపూర్‌కు చెందిన మాజీ జైలర్ కొడుకు జై ప్రకాశ్ మౌర్య.. సోమవారం హలియాలోని తన సోదరి ఇంటికి వెళ్లాడు. అప్పటికే పరిచయం ఉన్న పదో తరగతి చదువుతున్న బాలికకు ఫోన్ చేసి.. గ్రామ శివారుకు రావాలని చెప్పాడు. బాలిక అక్కడికి వెళ్లగానే జై ప్రకాశ్‌తోపాటు అతడి ముగ్గురు స్నేహితులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకు న్నారు. నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. అనంతరం దుండగులు బాలికతోపాటు హలియాకు తిరిగి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఓ సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. నిందితుల కారుపై పోలీస్ డిపార్టుమెంట్‌కు చెందిన లోగో అతికించి ఉన్నది.

మాయమాటలు చెప్పి..

ఫిరోజాబాద్‌లో నలుగురు వ్యక్తులు ఓ యువతికి మాయమాటలు చెప్పి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఓ యువతి కోచింగ్ సెంటర్‌కు వెళ్తుండగా నలుగురు వ్యక్తులు కారులో ఆమె వద్దకు వచ్చారు. మీ సోదరుడికి యాక్సిడెంట్ అయ్యింది. మాతో వస్తే తీసుకెళ్తాం అని మాయమాటలు చెప్పారు. వారిలో ముగ్గురు తెలిసినవారే కావడంతో ఆమె వారిని నమ్మింది. వారు ఆమెను నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. తర్వాత గాలిబ్ గ్రామ సమీపంలో కారులోనుంచి తోసేసి పారిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

ఫోన్ చేస్తే ఇంటి వద్ద దింపుతాం మహిళల భద్రత కోసం పంజాబ్ సర్కార్ కొత్త విధానం

చండీగఢ్: మహిళల భద్రత కోసం పంజాబ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య మహిళలెవరైనా ఇంటికి దూరంగా ఉన్నానని, ఇంటికి వెళ్లడానికి సాయం చేయాలని ఫోన్ చేస్తే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుంటారు. ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చుతారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లే పోలీసుల్లో ఒక మహిళా పోలీసు కూడా ఉంటారు. ఆపదలో లేదా అభద్రత భావంతో ఉన్న మహిళలు 100, 112, 181 నంబర్లకు ఫోన్ చేసి సాయం పొందాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చెప్పారు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.

244
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles