ఢిల్లీ తెలంగాణభవన్‌లో నేలకూలిన అమరవీరుల స్థూపం

Sat,May 20, 2017 01:35 AM

gunpark
న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: ఢిల్లీలోని తెలంగాణభవన్ ప్రాంగణంలో రెండేండ్ల కింద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులకు నేలకొరిగింది. తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా కొద్దిమంది తెలంగాణ అభిమానులు సొంత డబ్బులతో చెక్కతో ఈ స్థూపాన్ని స్థానికంగా తయారు చేయించారు. ఆవిర్భావ ఉత్సవాల అనంతరం ఈ స్థూపం దెబ్బతినకుండా ఉండటానికి ఏదైన గదిలో భద్రపరుచాలని అధికారులకు సూచించారు. అయినా పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గతేడాది జూన్ 2వ తేదీన జరిగిన రెండవ వార్షికోత్సవం సందర్భంగా కూడా ఇదే స్థూపానికి నివాళులర్పించారు. త్వరలో మూడో వార్షికోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో అమరవీరుల స్థూపం కూలిపోవడం అభిమానులను ఆవేదనకు గురిచేసింది. జూన్ 2వ తేదీన జరిగే మూడో వార్షికోత్సవం సందర్భంగా కొత్త స్థూపాన్ని తయారు చేయిస్తామని అధికారులు తెలిపారు.

172

More News