పంజాబ్‌లో కాంగ్రెస్ ‘ఫ్రీ’ జపంTue,January 10, 2017 02:15 AM

Manmohan-Singh
న్యూఢిల్లీ, జనవరి 9:పంజాబ్‌లో పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఫ్రీ జపం అందుకున్నది. వ్యవసాయ రుణమాఫీతోపాటు, ఉచిత విద్యుత్, ఉచిత స్మార్ట్‌ఫోన్లు, ఉచిత పుస్తకాలు, నిరుపేదలకు ఉచిత ఇండ్లు, ఇంటికో ఉద్యో గం, యువతకు నిరుద్యోగ భృతి తదితర హామీలు గుప్పించింది. ఈ మేరకు రూపొందించిన మ్యానిఫెస్టోను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాళీదళ్-బీజేపీ ప్రభుత్వం పదేండ్లుగా అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వం ఎంతో అవసరమన్నారు. అమరీందర్ ఎంతో ముందుచూపు ఉన్న నాయకుడని, పంజా బ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని కొనియాడారు. పంజాబ్‌వాసులు రేపటితరాల కోసం ఆలోచించాలని, తమ మ్యానిఫెస్టోను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించామని చెప్పారు. పదేండ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లిందని, దానిని పునరుద్ధరించి గాడిలోపెడుతామని అన్నారు. నోట్లరద్దుతో జీడీపీపై తీవ్ర వ్యతిరేక ప్రభావం పడుతుందని, ఇటీవలి పరిణామాలు దీనిని రుజువు చేస్తున్నాయని మన్మోహన్ పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు రూ.2,500 నిరుద్యోగభృతి ఇస్తామని, అదేవిధంగా పంజాబ్‌లోని డ్రగ్ మాఫియాను నెలరోజుల్లో కూకటివేళ్లతో సహా తొలగిస్తామని హామీ ఇచ్చారు. 90 రోజుల్లో కొత్త పారిశ్రామిక పాలసీని ప్రకటించి రాబోయే ఐదేండ్లలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.

333
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS