యువతిపై కత్తితో ఉన్మాది దాడి

Thu,October 17, 2019 01:26 AM

పశ్చిమ గోదావరి: ప్రేమను నిరాకరించిందని యువతిని ఓ ఉన్మాది కత్తితో పొడిచి తాను ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. పోడూరు మండలం కవిటంలో కొవ్వూరి తేజశ్రీ(20) కాలేజీకి వెళ్తుండగా సుధాకర్‌ అనే వివాహితుడు కత్తితో దాడిచేశాడు. అనంతరం తానూ విషంతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు, పోలీసులు వీరిని పాలకొల్లు దవాఖానకు తరలించగా.. పరిస్థితివిషమంగా ఉన్నట్టు సమాచారం. సుధాకర్‌ ఆ యువతిని ప్రేమపేరుతో వేధిస్తున్నాడని, ప్రేమను నిరాకరించడంతో దాడికి పాల్పడినట్టు స్థానికులు చెప్పారు. సుధాకర్‌కు పెండ్లయిందని, విడాకుల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles