గ్రామాలకు మేనక ఏబీసీడీ ర్యాంకులు!


Tue,April 16, 2019 01:34 AM

Maneka Gandhi ABCD Grading Of Villages Based On Votes

-బీజేపీకి పడిన ఓట్లే కొలబద్ధ
లక్నో: బీజేపీకి లభించిన ఓట్ల ఆధారంగా గ్రామాలను ఏ,బీ,సీ,డీ విభాగాలుగా విభజించి.. అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మరో వివాదాస్పద ప్రకటన చేశారు కేంద్రమంత్రి మేనకా గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమారుడు వరుణ్ గాంధీ బరిలో నిలిచిన యూపీలోని పిలిబిత్ నియోజకవర్గంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. పిలిబిత్‌లో ప్రతిసారి మేమే విజయం సాధిస్తున్నాం. ఏ,బీ,సీ,డీ విభాగాలుగా గ్రామాలను విభజించి, దాని ప్రకారం వాటిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఏ విభాగంలో బీజేపీకి అనుకూలంగా 80 శాతం ఓట్లు వేసిన గ్రామాల్ని చేర్చుతాం. బీజేపీకి 60 శాతం, 50 శాతం ఓట్లు వచ్చిన గ్రామాల్ని వరుసగా బీ, సీ విభాగాల్లోకి, అంతకంటే తక్కువ ఓట్లు వచ్చిన గ్రామాల్ని డీ విభాగంలోకి చేర్చుతాం. అభివృద్ధి పనులు మొదట ఏ.. తరవాత బీ, సీల్లో జరుగుతాయి. ఎవరు డీ పరిధిలోకి రావాలనుకోరు అని పరోక్షంగా ఓటర్లను హెచ్చరించినట్టు మేనక ప్రకటన చేశారు.

90
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles