రూ.2 కోసం హత్య

Mon,November 11, 2019 01:52 AM

-సైకిల్ టైర్లలో గాలి నింపుకొని పైసలివ్వనందుకు దారుణం
-ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

అమరావతి: రెండు రూపాయలపై చోటుచేసుకున్న వివాదం ఓ మనిషి ప్రాణం తీసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామా నికి చెందిన సువర్ణరాజు (24) శనివారం రాత్రి తన సైకిల్ టైర్లకు గాలికొట్టించుకొనేందుకు సాంబా అనే వ్యక్తి షాపునకు వెళ్లాడు. టైర్లలో గాలి నింపుకున్న అనంతరం రూ.2 చెల్లించలేదు. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తనను తిట్టడంపై కోపోద్రిక్తుడైన సువర్ణరాజు.. సాంబాపై చేయిచేసుకున్నాడు. అక్కడే ఉన్న సాంబా స్నేహితుడు అప్పారావు ఇనుపరాడ్డుతో వచ్చి సువర్ణరాజు తలపై మోదాడు. గాయపడిన రాజు ను కాకినాడ దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమించి మృతిచెందాడు. ప్రధాన నిందితుడు అప్పారావు పరారీలో ఉండగా, సాంబాను పోలీసులు అరెస్టుచేశారు.

918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles