బీజేపీకి కొమ్ముకాస్తున్న కేంద్ర బలగాలు


Wed,April 24, 2019 09:42 AM

mamata banerjee fires on bjp party

బెంగాల్ సీఎం మమత ఆరోపణ
ఆరాంబాగ్/ఖనకుల్: లోక్‌సభ ఎన్నికల్లో కేం ద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, మంగళవారం ఎన్నికలు జరిగిన దక్షిణ మాల్దా, బలుర్‌ఘాట్ నియోజకవర్గాల్లో కేంద్ర భద్రతా సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో కూర్చుని బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఓటర్లను కోరారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఓటర్లను ఇలా అడిగే హక్కు కేంద్ర బలగాలకు లేదని, ఈ విషయమై తమ అభ్యంతరాలను ఈసీకి తెలియజేశామన్నారు. కేంద్ర బలగాలను మీరు (బీజేపీ) ఉపయోగించుకోకూడ దు. 2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే చేశారు అని అన్నారు. మంగళవారం రాష్ట్రంలో పోలింగ్ జరిగిన ఐదు లోక్‌సభ స్థానాల్లోని 92 శాతానికిపైగా బూత్‌లలో కేంద్ర బలగాలను మోహరించారు. కాగా, ఎన్నికల షెడ్యూల్‌ను బీజేపీ నేతలకు అనుకూలంగా రూపొందించారని ధ్వజమెత్తారు. హుగ్లీ జిల్లా ఖనకుల్‌లో మంగళవారం ఆమె ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఎన్నడూ ఇంత సుదీర్ఘంగా ఎన్నికలు జరుగలేదన్నారు.

377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles