కాంగ్రెస్‌కు ఆరెస్సెస్ సాయం


Tue,April 16, 2019 11:22 AM

Mamata Banerjee claims RSS helping Congress in Bengal

-పశ్చిమబెంగాల్ సీఎంమమత ఆరోపణలు
బెల్డాంగ: పశ్చిమబెంగాల్‌లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఆరెస్సెస్ సహాయం తీసుకుంటున్నదని టీఎంసీ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు. ఆమె సోమవారం ముర్షీదాబాద్ జిల్లా బెల్డాంగ, భగవాన్‌గోలాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. జంగీపూర్ లోక్‌సభ స్థానంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ ముఖర్జీకి, బహ్రంపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ చౌదరికి మద్దతుగా ఆరెస్సెస్ ప్రచారం చేస్తున్నదన్నారు. గత ఏడాది ప్రణబ్ ముఖర్జీ నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. సీపీఐ ఇప్పటికే బీజేపీకి అమ్ముడుపోయిందని, బీజేపీ, సీపీఐ మద్దతుతో గెలువాలన్న వారిద్దరి వ్యూహాలు పనిచేయవన్నారు. తాను నోరు విప్పేలా చేయొద్దని.. అదే జరిగితే కాంగ్రెస్ బండా రం మొత్తం బయటపడుతుందని హెచ్చరించారు. బీజేపీ మతం పేరుతో ప్రజలను విడదీసి లబ్ధిపొందాలని భావిస్తున్నదని విమర్శించారు. దీదీ ఆరోపణలన్నీ అవాస్తవాలని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమన్ మిత్ర ఖండించారు. మమతాబెనర్జీ సహాయంతోనే పశ్చిమబెంగాల్‌లో ఆరెస్సెస్ అడుగుపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నటికీ బీజేపీ సహకారం తీసుకోదని స్పష్టంచేశారు.

136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles