మందుపాతర పేలి సైనికాధికారి మృతి


Sun,February 17, 2019 03:30 AM

Major Killed While Trying to Defuse IED Near LoC

-జవాన్‌కు గాయాలు
-మరో ఘటనలో పాక్ కాల్పుల వల్ల గాయపడిన సైనికుడు
-జమ్ములోని నౌషారా సెక్టార్‌లో ఘటనలు

జమ్ము, ఫిబ్రవరి 16: పుల్వామా ఉగ్రదాడిని మరువకముందే మరో దుర్ఘటన జరిగింది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉన్న నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి ఆర్మీ మేజర్ (సైనికాధికారి) మరణించారు. మరో జవాన్‌కు గాయాలయ్యాయి. బాంబు నిర్వీర్య బృందానికి నేతృత్వం వహిస్తున్న మేజర్ చిత్రేశ్ సింగ్ బిస్త్ శనివారం జవాన్లతో కలిసి నౌషారా సెక్టార్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు అమర్చిన మందుపాతరను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తూ అది పేలడంతో చిత్రేశ్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో జవాన్‌ను దవాఖానకు తరలించారు. మరోవైపు నౌషారా సెక్టార్ వెంట పాక్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడడంతో భారత జవాన్‌కు గాయాలయ్యాయి.

జవాన్లకు రూ.5 లక్షల చొప్పున సాయం: ఏపీ

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.

213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles