జయ మరణంపై మద్రాస్ హైకోర్టు మూడు ప్రశ్నలు

Tue,January 10, 2017 02:06 AM

Jayalalitha
చెన్నై, జనవరి 9: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే జయలలితకు అందిన చికిత్సపై సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఆమెకు సంబంధించిన వైద్య చికిత్సపై మద్రాస్ హైకోర్టు ధర్మాసనం మూడు అంశాలను లేవనెత్తింది. ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నందున ఆమె వైద్య చికిత్స వివరాలను ఏ మేరకు ప్రజలకు బహిర్గత పరుచవచ్చునో తెలపాలని కోర్టు ప్రశ్నించింది. రోగి వివరాలకు సంబంధించి హాస్పిటల్ కూడా విపత్కర పరిస్థితిలో పడిందా అని కోర్టు వ్యాఖ్యలు చేసింది.

మాజీ సీఎం జయ అనారోగ్యం అత్యంత క్లిష్టంగా మారిన నేపథ్యంలో ఆమె వైద్య చికిత్సకు సంబంధించిన వివరాలను దవాఖాన తప్పనిసరిగా బహిర్గత పరుచాల్సి ఉండాల్సింది అని అభిప్రాయపడింది. జయలలిత అనారోగ్యంతో దవాఖానలో చేరిన 75 రోజుల తర్వాత గత డిసెంబర్ 5 తేదీన మరణించిన విషయం తెలిసిందే. పురచ్చి తలైవి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లలో ఒకదానిపై సోమవారం మద్రాస్ హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్లను ట్రాఫిక్ కానిస్టేబుల్ రామస్వామి, ఏఐఏడీఎంకే కార్యకర్తలు గణేషన్, జోసెఫ్ దాఖలు చేశారు. జోసెఫ్ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎం సుందర్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌దారు తరఫున సీనియర్ న్యాయవాది కేఎం విజయన్ తన వాదనలు వినిపిస్తూ మరణానికి ముందు జయలలిత కాలును తొలగించారన్న వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.

1012

More News

మరిన్ని వార్తలు...