గణేశ్ నిమజ్జనంలో విషాదం


Sat,September 14, 2019 02:53 AM

Madhya Pradesh 11 killed as boat capsizes  during Immersion of Ganesh Idol

- మధ్యప్రదేశ్‌లో రెండు పడవలు బోల్తా 11 మంది దుర్మరణం
- ఆరుగురిని రక్షించిన సిబ్బంది


భోపాల్: మధ్యప్రదేశ్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. రెండు పడవలు బోల్తా పడడంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఆరుగురిని సహాయక సిబ్బంది రక్షించారు. ఖట్లాపురాలోని లోయర్ సరస్సు వద్ద శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు పడవల్లో మొత్తం 17 మంది వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఖట్లాపురా ఘాట్‌కు వెళ్లారని భోపాల్ కలెక్టర్ తెలిపారు. నిమజ్జనం చేసే క్రమంలో ఓ పడవ ఒకవైపునకు ఒరగడాన్ని గమనించి, రెండో పడవలో ఉన్న వ్యక్తులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలో వారి పడవ కూడా ఒరిగి రెండూ మునిగిపోయాయని వివరించారు. సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురిని రక్షించారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మృతుల కుటుంబాలకు రూ.11 లక్షలు పరిహారం ప్రకటించారు.
Madhya-Pradesh1

అమ్మా..పది రూపాయలివ్వు..

మృతుల్లో ఒకడైన 11 ఏండ్ల పర్వేజ్‌కు గణేషు డంటే విపరీతమైన భక్తి. ఐదేండ్లుగా నిమజ్జ నంలో పాల్గొంటున్నాడు. గురువారం రాత్రి అగర్‌బత్తుల కోసం రూ.10 ఇవ్వ మ్మా అని అడిగాడని, అవే పర్వేజ్ చివరి మాటలు అని అతడి తల్లి కన్నీరుమున్నీరయింది.

మహారాష్ట్ర, ఢిల్లీలోనూ..

నిమజ్జనం సందర్భంగా మహారాష్ట్రలో 18 మంది, ఢిల్లీలో నలుగురు మృతిచెందారు.

155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles