మరో 25 ఏండ్లలో రోబోలదే పైచేయిWed,January 24, 2018 01:55 AM

-కృత్రిమ మేధస్సు అభివృద్ధికి మార్గదర్శకాలు అవసరం
-నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్

Yunus
కోల్‌కతా, జనవరి 23: కృత్రిమ మేధస్సు(ఏఐ)తో తయారైన యంత్రాలు సమీప భవిష్యత్తులో మనుషులను దాటేస్తాయని, నిరుద్యోగాన్ని పెంచుతాయని బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత, మైక్రోఫైనాన్స్ రంగ మార్గదర్శకుడు మహ్మద్ యూనస్ పేర్కొన్నారు. సోమవారం కోల్‌కతాలో జరిగిన టాటా స్టీల్ లిటరసీ మీట్-2018లో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మరో 25-30 ఏండ్లలో విస్తృత వినియోగం, సమర్థతలో రోబోలు మనుషులను మించిపోతాయన్నారు. దీంతో మానవ వనరుల వినియోగం తగ్గి జనాభా ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాల్లో నిరుద్యోగం భారీగా పెరుగుతుందని చెప్పారు.

అప్పటికి రోబోలు మనుషుల అవసరం లేకుండా సొంతగా అభివృద్ధి చెందుతాయని, పరిజ్ఞానాన్ని పెంచుకుంటాయన్నారు. కృత్రిమ మేధస్సు రూపకల్పన, అభివృద్ధిలో మార్గదర్శకాలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలు నిలబెట్టే మందును కనుగొన్నా కచ్చితంగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. మరి కృత్రిమ మేధస్సు అభివృద్ధికి నిబంధనలు ఎందుకు వర్తించవు. వారికి ప్రభుత్వ అనుమతులు గానీ, సామాజిక నిబందనలు అడ్డురావడం లేదు. వెంటనే అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాలి అని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం, ఆహారం, కరువు నివారణ వంటి అంశాల్లో కృత్రిమ మేధస్సును ఉపయోగించాలన్నారు.

176

More News

VIRAL NEWS