గాలి నాణ్యతతో జీవితకాలం పెరుగుదలWed,September 13, 2017 02:43 AM

తాజా అధ్యయనంలో వెల్లడి
air
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశరాజధాని ఢిల్లీలో గాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపడితే.. అక్కడ నివసించే ప్రజల జీవితకాలం సగటున తొమ్మిదేండ్లు పెరుగుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. షికాగో యూనివర్సిటీ ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రమాణాలను భారతదేశానికి ఆపాదిస్తే ప్రస్తుతం ఉన్న సగటు జీవనకాలానికి అదనంగా నాలుగేండ్లు ప్రజల జీవితకాలం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ఈ అధ్యయనంలో భాగంగా ఢిల్లీ ప్రాంతంలో గాలిలో ఉన్న మలిన పదార్థాలను పీఎం 2.5 వద్ద పరిగణనలోకి తీసుకుని, ఆ పరిమాణంలో మలినాలను తగ్గిస్తే అది ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో లెక్కించారు. ప్రస్తుతం ఢిల్లీ నగరంలో ఉన్న కాలుష్యం పీఎం 2.5.. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్‌కు 10 మైక్రోగ్రాములకు తగ్గితే అక్కడ నివసించే ప్రజలు సగటున తొమ్మిది సంవత్సరాలు అధికంగా జీవించే అవకాశం ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల గాలి నాణ్యత మెరుగుపడితే కోల్‌కతా, ముంబై నగరాల ప్రజలు సుమారు 3.5 ఏండ్లు, లక్నో, పాట్నా, చెన్నై నగరాల ప్రజలు వరుసగా 7.6, 6.9, 1.7 ఏండ్లు అధికంగా జీవించే అవకాశం ఉంటుంది.

457

More News

VIRAL NEWS