చిన్నారిమీద కాల్పులు జరిపిన ఉగ్రవాది హతం


Thu,September 12, 2019 02:38 AM

Lashkar e Taiba militant who attacked Sopore apple trader shot dead in Kashmir

- జమ్ముకశ్మీర్‌లో ఘటన

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తాయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ సందర్భంగా జరిగిన గ్రెనేడ్ దాడిలో ఇద్దరు పోలీసులు సైతం గాయపడ్డారు. ఇటీవల సోపోర్‌లో పండ్ల వ్యాపారి హమీదుల్లా రాథర్ ఇంట్లోకి దూరి ఐదేండ్ల బాలికసహా ముగ్గురిపై కాల్పులు జరిపింది.. ఎదురుకాల్పుల్లో హతమైన ఉగ్రవాది ఆసిఫ్ మగ్బుల్ భట్ అని పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో సోదాలు నిర్వహిస్తుండగా మగ్బుల్ భట్ భద్రతా బలగాల హెచ్చరికను ఖాతరుచేయకుండా గ్రెనేడ్ విసరడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్‌సింగ్ మీడియాకు తెలిపారు. సోపోర్‌లో భట్ భయానక వాతావరణాన్ని సృష్టించాడని, నెలరోజులుగా స్థానికంగా బెదిరింపు పోస్టర్లను వేస్తూ దుకాణాలు తెరువకుండా, ప్రజలు రోజువారీ కార్యకలాపాలు నిర్వహించకుండా భయపెడుతున్నాడని తెలిపారు. పండ్లవ్యాపారి ఇంట్లోకి వెళ్లి ముగ్గురిపై కాల్పులు జరిపాడని చెప్పారు.

204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles