ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలుSat,May 20, 2017 02:39 AM

చార్‌ధామ్ యాత్రికులకు కష్టాలు.. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన1000-1500 మంది

Rescue-work
న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: చార్‌ధామ్ యాత్రకు వెళ్ళినవారు వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఈ సం ఖ్య 1000-1500 వరకు ఉంటుందని అంచనా. ఉత్తరాఖండ్‌లో రుద్రపయాగ్ దగ్గర రిషీకేష్-బద్రీనాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు, యాత్రికుల ప్రయాణం నిలిచిపోయాయి. యాత్రికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయినట్టు చమోలి జిల్లా కలెక్టర్ ఆశీష్ జోషీ పేర్కొన్నారు. పరిస్థితులు చక్కబడేంత వరకు చార్‌ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు. శుక్రవారం సాయం త్రం వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులు వీచాయని, వర్షం మొదలైందని, ఆ సమయంలోనే కొండచరియలు విరిగిపడినట్టు సమాచారం వచ్చిందని వివరించారు.
Hundreds
వెంటనే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు రంగంలోకి దిగిన బండరాళ్ళను తొలగించే పనులు చేపట్టారని, శనివారం మధ్యాహ్నం కల్లా పరిస్థితిని చక్కదిద్దుతామని తెలిపారు. చాలామంది యాత్రికులు కర్ణప్రయాగ్, పిపాల్‌కోట్, గోవింద్‌ఘాట్, జోషిమఠ్ తదితర ప్రాంతాల్లోనే ఆగిపోయారని, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం వీరికి ఆహారం, త్రాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.

263

More News

VIRAL NEWS