కువైట్.. అత్యంత సోమరి దేశం


Sun,September 9, 2018 02:17 AM

Kuwait is the most lazy country

-ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో భారత్‌కు 117 వ ర్యాంకు
-94.5 శాతం క్రియాశీల ప్రజలతో ఉగాండాకు తొలి స్థానం

న్యూఢిల్లీ: కువైట్ అత్యంత సోమరిపోతులను కలిగి ఉన్న దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. మొత్తం 168 దేశాల్లోని 1.9 మిలియన్ల ప్రజలపై పరిశోధనలు జరిపిన తర్వాత ఈ నివేదికను డబ్ల్యూహెచ్‌వో తయారుచేసింది. అత్యంత చురుకైన ప్రజలున్న దేశంగా ఉగాండా నిలువగా.. చివరి 168 వ స్థానంలో కువైట్‌కు స్థానం దక్కింది. భారత్‌కు 117 వ స్థానం లభించింది. భారతీయుల్లో 34 శాతం మంది తగినంత క్రియాశీలంగా లేరని తేలింది. ప్రజలు ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, వ్యాయామానికి కేటాయిస్తున్న సమయం ఆధారంగా ఇచ్చిన ర్యాంకుల్ని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ ప్రచురించింది. ఈ జాబితా ప్రకారం 94.5% మంది క్రియాశీలకంగా ఉన్న ఉగాండా తొలి స్థానంలో నిలిచింది. ఆ దేశ ప్రజలు ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారన్నది. కాగా, కువైట్‌లో 67% మంది జనాభా సోమరితనంతో ఉండి శారీరక వ్యాయామాన్ని పట్టించుకోవడంలేదని తెలిపింది.

1274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles