వివాదాస్పద ప్రకటనలు వద్దు


Sun,May 19, 2019 02:24 AM

Kumaraswamy appealed to Congress and JDS leaders

-కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు కుమారస్వామి విజ్ఞప్తి
బెంగళూరు: ఎన్డీయే ఏతర పక్షాల మధ్య ఐక్యత కోసం కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పరస్పర విమర్శలకు, వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలని ఆయన జేడీఎస్ సభ్యులతోపాటు, కాంగ్రెస్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మనం కృషి చేస్తున్నాం. బీజేపీ ఏతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మనం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. ఇటువంటి తరుణంలో కూటమిలోని భాగస్వాములు పరస్పరం విమర్శలు, వివాదాస్పద ప్రకటనలు చేసుకుంటే మన ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. కనుక ఇటువంటి విమర్శలు, వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలని రెండు పార్టీల (జేడీఎస్, కాంగ్రెస్) నేతలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అని కుమారస్వామి ట్వీట్ చేశారు. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ నేతల మధ్య గత కొంత కాలం నుంచి మాటల యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అయితే తామంతా ఐక్యంగా ఉన్నామని, కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ పేర్కొన్నారు.

178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles