చిక్కుల్లో కుమార ప్రభుత్వం!


Tue,September 18, 2018 01:58 AM

Kumara swamy is doing the BJP resort politics

-సర్కార్ పతనం కానున్నదంటూ జోరుగా పుకార్లు
-కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం
-బీజేపీ రిసార్ట్ రాజకీయాలు చేస్తున్నదన్న కుమారస్వామి
-బుధవారం కల్లా బెంగళూరు రావాలని ఎమ్మెల్యేలకు బీజేపీ ఆదేశం

బెంగళూరు, సెప్టెంబర్ 17: కర్ణాటకలో నాలు గు నెలల వయస్సున్న జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కానున్నదన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలంతా బుధవారం నాటికి బెంగళూరుకు చేరుకోవాలని బీజేపీ ఆదేశించడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. అక్రమ, రాజ్యాంగ విరుద్ధ మార్గాల్లో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ఆరోపించింది. ఈ ఆ ఆరోపణలను బీజేపీ కొట్టి పారేసింది. కూటమి సర్కార్ తనంతటతానే కూలిపోతుందన్నదని పేర్కొన్నది. కొందరు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు భారీగా డబ్బును, మంత్రి పదవులను ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు వార్తలు బయటకు పొక్కాయి. దీంతో బీజేపీ కుట్రను విఫలం చేసేందుకు జేడీఎస్-కాంగ్రెస్ కూటమి నేతలు ప్రత్యామ్నాయ వ్యూహ రచన కోసం వరుస భేటీలు జరుపుతున్నారు. యూరప్ పర్యటన ముగించుకుని బెంగళూరుకు చేరుకున్న మాజీ సీఎం సిద్దరామయ్య అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించారు.

బీజేపీ వలలో పడొద్దని వారికి నచ్చజెప్పారు. మరోవైపు గుల్బర్గాలో సోమవారం హైదరాబాద్-కర్ణాటక విముక్తి దినోత్సవ వేడుకల్లో సీఎం హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ బీజేపీ మరోసారి రిసార్ట్ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం అనైతిక, అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు యడ్యూరప్ప మాఫియా మనుషులను నియమించారు అని ఆరోపించారు. జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యే హెచ్‌కే కుమారస్వామి భార్య చంచల మాట్లాడుతూ తన భర్త వద్దకు ఇద్దరు బీజేపీ నేతలు వచ్చి రూ.30 కోట్ల నగదు, మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు బీజేపీ తన ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు చేసేందుకు సిద్ధమైంది. పార్టీ ఎమ్మెల్యేలంతా బుధవారం కల్లా బెంగళూరుకు రావాలని ఆదేశించింది. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది.

621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS