మూడో రోజూ కోల్‌కతా సీపీ విచారణ


Tue,February 12, 2019 12:29 AM

Kolkata CP Rajeev Kumar in Shillong, to face CBI interrogation

-దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు నిరాకరణ
షిల్లాంగ్: చిట్ ఫండ్ స్కాములకు సంబంధించి కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను సోమవారం మూడోరోజు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు ప్రశ్నించారు. ఆయనతోపాటు తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్‌నూ విచారించారు. శారదా స్కామ్‌లో కునాల్ 2013లో అరెస్ట్ కాగా, 2016లో బెయిల్‌పై విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో సీబీఐ ప్రశ్నిస్తున్నది. కాగా, తన విచారణను వీడియో తీయాలన్న రాజీవ్ డిమాండ్‌ను సీబీఐ తిరస్కరించింది. కస్టడీకి తీసుకున్న సందర్భాల్లోనే వీడియో తీసేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, శారదా స్కామ్‌లో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దర్యాప్తును పర్యవేక్షించేందుకు కమిటీ వేసే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేసింది.

270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles