యుద్ధాలంటూ జరిగితే ఇక అంతరిక్షంలోనే!Wed,January 11, 2017 01:45 AM

బ్రహ్మోస్ సృష్టికర్త శివథాను పిైళ్లె వెల్లడి
ముంబై: భవిష్యత్‌లో యుద్ధాలన్నీ అంతరిక్షంలో జరుగుతాయంటున్నారు బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ సృష్టికర్త, ప్రముఖ శాస్త్రవేత్త ఏ శివథాను పిళ్లే. ఒకవేళ రానున్న కాలంలో యుద్ధాలు గనుక జరిగితే అది ఉపగ్రహానికి, ఉపగ్రహానికి మధ్య జరుగుతుంది అని అన్నారు. మంగళవారం ముంబైలోని విలే పార్లే సబర్బన్‌లోని ఓ కాలేజీలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో సరిహద్దులో సైన్యాన్ని మోహరించి యుద్ధాలు జరిగే పరిస్థితి ఉండదు.
PILLAI
సముద్ర గర్భంలో అణు జలాంతర్గాముల పోరాటం జరుగుతుంది. వీటన్నింటి కంటే సైబర్‌వార్ ప్రధానంగా మారుతుంది. నీవు కూర్చున్న చోటే బటన్ నొక్కితే సరిహద్దులో జరుగాల్సింది జరిగిపోతుంది. సమాచార యుద్ధతంత్రమే ఒక ప్రపంచాన్ని శాసిస్తుంది అని తెలిపారు. ఆదిత్య ప్రాజెక్ట్ పేరుతో సూర్యుడిపై అధ్యయనం, చంద్రుడిపైన భారతీయుడు కాలుమోపే ప్రక్రియపై విస్తృత పరిశోధన జరుగుతున్నదన్నారు. అందులో భాగంగానే 2017లో డిసెంబర్‌లో చంద్రుడిపైకి రోవర్‌ను పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. చంద్రుడికి అవతల ఉన్న మార్స్ గ్రహంపై మనం పంపిన మంగళ్‌యాన్ చాలా స్వేచ్ఛగా చక్కర్లు కొడుతున్నదని, రాబోయే కాలంలో అంగారకుడు, చంద్రుడిపైకి మరిన్ని అంతరిక్ష యా త్రలు చేపట్టునున్నామని పేర్కొన్నారు. శుక్ర గ్రహంపైకి యాత్ర చేపట్టడమే ఇక తదుపరి కార్యాచరణ అని ఆయన అన్నారు.

696
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS