లాహిరి లాహిరిలో సడన్ సర్‌ప్రైజ్!


Sat,April 20, 2019 02:15 AM

Kerala Couple Fall into River During Pre Wedding Photoshoot

వైరల్ అవుతున్న కేరళ జంట ప్రీవెడ్డింగ్ షూట్ వీడియో
న్యూఢిల్లీ: వివాహానికి సంబంధించిన ప్రతీ సందర్భాన్ని మధురజ్ఞాపకంగా మల్చుకునే ధోరణి ఇటీవల పెరిగింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ఎక్కువవుతున్నది. అయితే అది కొన్నిసార్లు హృద్యంగా ఉంటుండగా.. మరికొన్ని అబాసుపాలయ్యేలా పరిస్థితి వస్తుంది. తాజాగా.. కేరళలో ఓ జంట నదీ తీరంలో తీసుకుంటున్న ప్రీవెడ్డింగ్ షూట్‌లో జరిగిన ఓఅనూహ్య ఘటన సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది. కేరళకు చెందిన టిజిన్, శిల్ప అనే కాబోయే నవజంట ప్రీవెడ్డింగ్ షూట్ చిరస్మరణీయంగా ఉండాలన్న ఆశతో పంబా నది తీరానికి వెళ్లింది. పడవలో కూర్చొన్న ఆ జంట క్లోజ్ షాట్‌ను ఫోటోగ్రాఫర్లు తీయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పడవ ఒక్కసారిగా ఓవైపు ఒరిగిపోవడంతో వారిద్దరూ నీళ్లలో పడిపోయారు. లోతు ఎక్కువగా లేకపోవడంతో తేరుకొని లేచారు. వెరైటీగా ఉంటుందని చివరి నిమిషంలో ఆ జంట నీటిలో పడే సీన్‌ను వెడ్డింగ్ ప్లానర్ స్టూడియో నిర్వాహకులు కావాలనే ప్లాన్ చేసినట్టు సమాచారం.

176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles