ఓనం ఉత్సవాలు రద్దు


Thu,August 16, 2018 12:44 PM

Kerala continues to reel under floods death toll rises to 39

-సహాయ చర్యలకు ఆ నిధుల వినియోగం
-కేరళ ప్రభుత్వం నిర్ణయం
-ఆరు జిల్లాల్లో భారీగా వర్షాలు.. 39కి చేరిన మృతులు

తిరువనంతపురం, ఆగస్టు 14: కేరళలో నిరంతరంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారికంగా ఓనం ఉత్సవాలు జరుపరాదని, ఆ నిధులను తుఫాను సహాయ, పునరావాస చర్యలకు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రమంతటా వరదలు పోటెత్తడంతో బుధవారం స్వాతంత్య్ర దినోత్సవంసందర్భంగా ఇచ్చే విందును రద్దు చేసుకున్నట్లు గవర్నర్ పీ సదాశివం తెలిపారు. వయనాడ్, ఇడుక్కితోపాటు కోజికోడ్, మలప్పురం, కన్నూర్, పాలక్కడ్ జిల్లాల్లో మంగళవారం భారీవర్షాలు కురిశాయి. మట్టుపెట్టి రిజర్వాయర్ రెండుగేట్లను ఎత్తివేయడంతో ఇడుక్కి జిల్లాలోని మున్నార్ పట్టణంతో సంబంధాలు తెగిపోయాయి. ఇడుక్కి రిజర్వాయర్‌లో నీటిమట్టం నిల్వలు తగ్గినా ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటి నిల్వలు 136.10 అడుగులకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వరద బాధిత ప్రాంతాల్లో అలర్ట్ కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కురిచ్యా, మాక్కి కొండలు, వయనాడ్‌లోని థామరాస్సెరే ఘాట్‌రోడ్‌పై కొండచరియలు విరిగి పడ్డాయి. మలప్పురంలోని నీలంబర్ తదితర లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వర్షాలతో 215కి చోట్ల కొండ చరియలు విరిగి పడగా, 444 గ్రామాలు వరదల ప్రభావంతో దెబ్బ తిన్నాయని, వేర్వేరు ఘటనల్లో మృతుల సంఖ్య 39 చేరిందని ప్రభుత్వం ప్రకటించింది.

20వేలఇండ్లు పూర్తిగా దెబ్బ తినగా, సుమారు 30 వేల మంది సహాయ శిబిరాల్లో తల దాచుకుంటున్నారని తెలిపింది. కొండ చరియలు విరిగి పడటంతో 10 వేల కి.మీ పొడవునా రోడ్లు ధ్వంసమయ్యాయని సీఎం పినరాయి విజయన్ మంగళవారం మీడియాకు చెప్పారు. పంపానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అయ్యప్ప భక్తులు శబరిమలకు రావద్దని దేవస్థానం కోరింది. వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles