30 ఏండ్ల కిందట రూ.200 అప్పు.. చెల్లించడానికి కెన్యా నుంచి భారత్‌కు రాక


Fri,July 12, 2019 02:21 AM

Kenyan MP returns to India after 30 years to repay Rs 200 debt to Aurangabad grocer

- నీతి నిజాయితీలకు అద్దం పట్టిన ఘటన

ముంబై: తీసుకున్న అప్పు చెల్లించకుండా తిరిగే ఈ రోజుల్లో.. కేవలం రూ.200 అప్పు చెల్లించడానికి దేశం కాని దేశం నుంచి వచ్చా డు ఓ వ్యక్తి. అది కూడా దాదాపు 30 ఏండ్ల కింద చేసిన రూ.200 అప్పును గుర్తు ఉంచుకొని మరీ చెల్లించాడు. కెన్యాలోని న్యారిబారి ఛాఛి ఎంపీ రిచర్డ్ టాంగీ 1985-89 మధ్య మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించినప్పుడు వాంఖేడినగర్‌లో నివాసం ఉన్న ఇంటి వద్ద ఓ కిరాణ దుకాణంలో రూ.200 అప్పు చేశారు. చదువు పూర్తికాగానే స్వదేశానికి వెళ్లిపోయారు. కానీ తన అప్పు సంగతి మరిచిపోలేదు. భార్య మిషెల్లీతో కలిసి సోమవారం కిరాణం దుకాణం యజమాని గౌలి ఇంటికి వచ్చిన రిచర్డ్ విలేకరులతో మాట్లాడుతూ ఔరంగాబాద్‌లో చదువుకున్నప్పుడు గౌలి వద్ద రూ.200 అప్పు చేసి తర్వాత కెన్యాకు వెళ్లిపోయాను. ఆ అప్పు గౌలికి రూ.200 తిరిగి ఇచ్చేయడానికి ఇక్కడికొచ్చాను. అప్పు తీర్చానన్న భావోద్వేగంతో నా కండ్ల నుంచి ఆనందబాష్పాలు రాలాయి అని తెలిపారు. తమ ఇద్దరి మధ్య అనుబంధాన్ని గుర్తుచేసుకున్న గౌలి ఎంతో ఆనంద పడ్డారని చెప్పారు. తమ భోజనం కోసం ఓ హోటల్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నించగా వద్దని వారించి ఇంట్లోనే భోజనం చేద్దామని చెప్పానన్నారు. కెన్యాలోని తమ ఇంటికి రావాలని గౌలిని ఆహ్వానించానని వివరించారు.

3167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles