జాతీయ రాజకీయాల్లో కరుణ ముద్ర


Wed,August 8, 2018 12:28 PM

Karunanidhi with National Front coalition leaders VP Singh and NTR

1989లో వీపీ సింగ్ సారథ్యంలోని నేషనల్ ఫ్రంట్‌లో డీఎంకేను భాగస్వామ్యం చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కరుణ ప్రవేశించారు. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ల కల్పించాలంటూ మండల్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించారు. 1999లో ప్రధాని అటల్ బీహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో కొనసాగారు. ఆ తర్వాత వారికి గుడ్‌బై చెప్పి 2004, 2009లలో కాంగ్రెస్‌తో జత కలిశారు.

రాష్ర్టాల స్వయంప్రతిపత్తి కోసం..

భారత్‌లో రాష్ర్టాలకు కూడా స్వయంప్రతిపత్తి ఉండాలని కరుణ బలంగా వాదించేవారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో 1969లో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై రాజమన్నార్ కమిటీని నియమించారు. రాష్ర్టాలకు హక్కులపై ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది. స్వాతంత్య్రం దినోత్సవం రోజున ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని ఎగురవేసే హక్కు కరుణానిధి కృషి వల్లే లభించింది. ముఖ్యమంత్రిగానూ కరుణ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 31 శాతానికి పెంచారు. అన్ని కులాల వారిని ఆలయ పూజారులుగా నియమించే చట్టానికి ఆమోదముద్ర వేశారు. అధికారిక ఉత్సవాలు, పాఠశాలల్లో తమిళ జాతయ గీతాలాపన తప్పనిసరి చేశారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు కల్పించారు.

1662
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles