కరుణానిధి X ఎంజీఆర్


Wed,August 8, 2018 12:29 PM

Karunanidhi and MGR A checkered friendship and a lesson in civility and empathy

తొలినాళ్లలో కరుణ, ఎంజీఆర్ ప్రాణ స్నేహితులు. కానీ తర్వాత వీరిద్దరూ బద్ధ శత్రువులయ్యారు. కరుణను ఎంజీఆర్ తన గురువుగా భావించేవారు. అన్నాదురై మరణాంతరం కరుణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది. కానీ, ఎప్పుడైతే కరుణ తన కుమారుడికి, కుటుంబసభ్యులకు అత్యధిక ప్రాధాన్యమివ్వడం ప్రారంభించారో ఇద్దరి మధ్య అంతరాలు పెరిగాయి. దీంతో 1972లో ఎంజీఆర్‌ను డీఎంకే నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించి కరుణానిధిని ఎన్నికల్లో మట్టికరిపించారు. 1977 నుంచి ఆయన మరణించేవరకూ(1987) ఎంజీఆర్ సీఎంగానే కొనసాగారు. ఈ లవ్-హేట్ అనుబంధంపై మణిరత్నం ఇరువర్ అనే సినిమాను తీశారు. సినిమా స్క్రిప్టు రచయితగా కరుణానిధి తన మొదటి కథ రాసింది ఎంజీ రామచంద్రన్ చిత్రానికే. 1947లో విడుదలైన రాజకుమారి చిత్రానికి కథ రాశారు. తమిళ సినీ రంగ చరిత్రలో మహా కావ్యాలుగా పేరొందిన పలు చిత్రాలకు కరుణానిధి స్క్రీన్‌ప్లే రాశారు. ఎంజీఆర్ నటించిన మంత్రికుమారి మలైక్కాలన్, శివాజీ గణేశన్ నటించిన ప్రశాంత్, మనోహర్ చిత్రాలకు ఆయనే స్క్రీన్ ప్లే సమకూర్చారు. చివరిగా 2011లో ప్రశాంత్ నటించిన పోస్‌నార్ శంకర్ చిత్రానికి కథ రాశారు. మొత్తం 69 చిత్రాలకు స్క్రీన్ ప్లే రాసిన కరుణానిధికి తమిళ సినీ రంగంతో 64 ఏండ్ల అనుబంధం ఉన్నది. 2016లో రామానుజార్ సీరియల్‌కు కరుణ సంభాషణలు రాశారు.

1119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS