కర్ణాటక మంత్రి రాజీనామా


Fri,October 12, 2018 12:24 AM

Karnataka Minister resigns

-బీఎస్పీ పటిష్ఠతపై దృష్టి పెడతానని వెల్లడి
బెంగళూరు, అక్టోబర్ 11: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే ఎన్ మహేశ్ తన పదవికి రాజీనామా చేశారు. గురువారం రాజీనామా లేఖను సీఎం కుమారస్వామికి అందజేసిన అనంతరం మహేశ్ విలేకరులతో మాట్లాడారు. తన నియోజకవర్గం కొల్లెగల్ అభివృద్ధిపై మరింత దృష్టి సారించడానికి, లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేయడానికే మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వానికి తన మద్దతు కొనసాగుతుందని తెలిపారు. నేను బెంగళూరులో కూర్చుంటున్నానని, కొల్లెగల్‌పై దృష్టి సారించడం లేదని ప్రచారం జరుగుతున్నది. అంతేగాక లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్ట పర్చాల్సిన అవసరం ఉన్నది. నాపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, పార్టీ భవిష్యత్ కోసం రాజీనామా చేశాను అని మహేశ్ పేర్కొన్నారు.

212
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles