మాండ్య మకుటం ఎవరికో?


Tue,April 16, 2019 11:20 AM

Karnataka Mandya Ex Actor Faces Chief Minister Son In Big Fight

-దేవెగౌడ కుటుంబానికి చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్
-అధిష్ఠానం ఆదేశాలు ధిక్కరించి బహిరంగంగానే స్వతంత్ర అభ్యర్థి సుమలతకు స్థానిక నేతల మద్దతు
మాండ్య, ఏప్రిల్ 15: కర్ణాటక రాజకీయం మాండ్య లోకసభ స్థానం చుట్టూనే పరిభ్రమిస్తున్నది. మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ మాండ్య నుంచి పోటీచేయడమే ఇందుకు కారణం. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నెల 18న ఈ ని యోజకవర్గంలో ఎన్నిక జరుగనుంది. కాగా, సుమలత బీజేపీ మద్దతు కోరారు. ఆమెకు బీజేపీ పరోక్షంగా సహకరిస్తే, అధిష్ఠానం ఆదేశాల్ని ధిక్కరించి కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో సంకీర్ణ సర్కారును నడుపుతూ మిత్రులుగా ఉన్న జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు మాండ్యలో కత్తులు దూసుకుంటున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా బద్ద శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇక్కడ అలయ్‌బలయ్ అంటూ కలిసి తిరుగుతున్నారు.

కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘాల మద్దతుతో సుమలత ప్రచారంలో దూసుకుపోతున్నారు. మిత్రధర్మాన్ని విస్మరించి కాంగ్రెస్ నేతలు సుమలతకు సహకరించడం దేవెగౌడను కలవరపెడుతున్నది. మాండ్య నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో జేడీఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉండడం, దేవెగౌడ సామాజిక వర్గానికి చెందిన వక్కళిగల జనాభా సుమారు 60 శాతం ఉండడం నిఖిల్‌కు కలిసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. తమ కుటుంబంలోని మూడో తరం వారసుడైన నిఖిల్‌ను గెలిపించాలంటూ దేవెగౌడ పలు సభల్లో కన్నీరుపెడుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు అంబరీష్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్, ఆయన మరణంతో ఏర్పడిన సానుభూతి, బీజేపీ, కాంగ్రెస్, రైతు సంఘాల మద్దతు తనను గట్టెక్కిస్తుందని సుమలత విశ్వసిస్తున్నారు. మాండ్యలో కాంగ్రెస్ నేతలు బహిరంగంగా జెండాలు పట్టుకుని సుమలత ప్రచారంలో పాల్గొనడంపై జేడీఎస్ భగ్గుమంటున్నది. అది సంకీర్ణ సర్కారు మనుగడపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నది.
Nikhil-Kumaraswamy

నా తనయుడిని ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం: కుమారస్వామి

మాండ్యలో తన కుమారుడు నిఖిల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, ఇతర పార్టీలు కలిసి పద్మవ్యూహం పన్నాయని సీఎం కుమారస్వామి ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థి సుమలతతో వీరంతా చేతులు కలిపారని, ఎన్నికల ఫలితాల అనంతరం వారి బండారం బయటపెడతానని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్యతో నిఖిల్ ప్రత్యేకంగా సమావేశమై మద్దతు కోరారు. తన ప్రచారంలో పాల్గొనాలని కోరగా ఆయన సమ్మతించారు.

207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles