దేవుడి దయవల్లే బతికిపోయాం


Wed,April 24, 2019 02:34 AM

Karnataka Doctor Family Thank Stars For Escape From Sri Lanka Blasts

-లేకుంటే మా ప్రాణాలు కూడా పోయేవి
-శ్రీలంక పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న కర్ణాటక డాక్టర్ కుటుంబం

బెంగళూరు, ఏప్రిల్ 23: శ్రీలంకలో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల నుంచి కర్ణాటకకు చెందిన ఓ డాక్టర్ కుటుంబం తృటిలో బయటపడింది. డాక్టర్ రఘురాం కొలంబోలోని ఆసియా దవాఖానలో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం ఆయన కొలంబోలోని శాంగ్రిలా హోటల్ పక్కన ఉన్న మరో హోటల్‌లో బసచేశారు. 10 మంది కుటుంబసభ్యులతో కలిసి ఆ ప్రాంతంలో సంచరించారు. పేలుళ్లు సంభవించడానికి కొన్ని గంటల ముందు అక్కడి నుంచి బెంటోటా ప్రాంతానికి వెళ్లారు. వీరు వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే శాంగ్రిలా హోటల్‌పై దాడి జరిగింది. బెంటోటా వెళ్లాక ఈ పేలుడు విషయం తెలిసిన ఆయన ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. డాక్టర్ రఘురాం మాట్లాడుతూ మరి కొన్ని గంటలు కొలంబోలోనే ఉంటే తాము కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేదని చెప్పారు. అదో రోజు సాయంత్రం బెంటోటా నుంచి కొలంబోకు తిరిగి వచ్చామని, అక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నదని తెలిపారు. రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, దుకాణాలు మూసిఉన్నాయని, కర్ఫ్యూ విధించారని పేర్కొన్నారు. తమ నివాసానికి చేరుకోవడానికి పోలీసులు సహకరించారని వివరించారు.

449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles