కర్ణాటకలో పెట్రో ధరపై రూ.2 తగ్గింపు


Tue,September 18, 2018 01:41 AM

Karnataka Declares Rs2Litre Cut For Petrol

బెంగళూరు: పెట్రోల్, డీజిల్‌లపై లీటర్‌కు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. కలబుర్గిలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించే సెస్‌లో కోత విధించడం ద్వారా ధర తగ్గించినట్లు సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. సేల్స్ టాక్స్‌ను పెట్రోల్‌పై 3.25 శాతం, డీజిల్‌పై 3.27 శాతం తగ్గించినట్లు తెలిపింది. ఇంతకుముందు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.

198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS