కేజ్రీవాల్‌కు హవాలాతో సంబంధాలుSat,May 20, 2017 02:01 AM

Kapil-Mishra
-మరో బాంబు పేల్చిన కపిల్ మిశ్రా
న్యూఢిల్లీ, మే 19: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హవాలాతో సంబంధాలు ఉన్నాయి.. అందుకే ఆయన నోట్లరద్దును వ్యతిరేకించారంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే కపిల్ మిశ్రా మరో బాంబు పేల్చారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిశ్రా పలు ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నివసిస్తున్న న్యాయవాది రోహిత్ టాండన్‌కు చెందిన కంపెనీ నుంచి ఆప్‌కు భారీగా నిధులు వచ్చేవన్నారు. నోట్లరద్దు తర్వాత రోహిత్‌కు చెందిన రూ.కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ కింద ఈడీ స్వాధీనం చేసుకున్నదని చెప్పారు. నోట్లరద్దును కేజ్రీవాల్ ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించారు? కేంద్రానికి వ్యతిరేకంగా పలు రాష్ర్టాల్లో ఎందుకు ర్యాలీలు నిర్వహించారు? ఎందుకంటే ఆయన మనుషుల దగ్గర భారీగా నల్లధనం ఉన్నది. ఈడీ దాడుల్లో అది బయటపడ్డది అని ఆరోపించారు. కేజ్రీవాల్ గుట్టు తన చేతిలో ఉన్నదని, ఎప్పటికైనా ఆయన తీహార్ జైలుకు వెళ్లాల్సిందేనన్నారు.

411

More News

VIRAL NEWS