కన్నడ హీరో ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీSun,August 13, 2017 06:29 AM

పేరు, ఇతర వివరాలు తరువాత వెల్లడిస్తానని ప్రకటన
upendra
బెంగళూరు, ఆగస్టు 12: కన్నడ హీరో ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు శనివారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సందేశంతో కూడిన ఆడియో క్లిప్పును విడుదల చేశారు. ఆయన గతకొద్ది రోజులుగా తన రాజకీయరంగ ప్రవేశంపై పలు సూచనలు చేస్తూనే వస్తున్నారు. ఖాకీ రంగు చొక్కా ధరించి వచ్చిన ఉపేంద్రను ఉద్దేశించి ఆయన అభిమానులు రియల్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. తాను జన నాయకుడిని, జన సేవకుడిని కాదని.. జన కార్మికుడిననే అర్థం వచ్చేలా ఖాకీ చొక్కా వేసుకున్నానని ఉపేంద్ర తెలిపారు. తాను పూర్తిస్థాయి పారదర్శక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేస్తున్నానని పేర్కొన్నారు. ఇదొక బహిరంగ వేదిక.. దీనికి డబ్బు, కులం లాంటివి అవసరం లేదు. ఎవరైనా చేరవచ్చు అని ఉపేంద్ర అన్నారు. పార్టీలో చేరే ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత పార్టీ పేరు, ఇతర వివరాలు ప్రకటిస్తానని చెప్పారు. పేదలకు మంచి ఆరోగ్య సదుపాయాలు, విద్యావకాశాలు కల్పించవచ్చని, కానీ ప్రస్తుత పార్టీల నుంచి ఏమీ ఆశించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు చాలా పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చాయని, కానీ వాటిలో చేరితే తాను అందులోని నాయకుల్లా మారిపోవాల్సి వస్తుందని చేరలేదని ఉపేంద్ర వివరించారు.

922

More News

VIRAL NEWS