రైతు కోటయ్యను మీరే చంపేశారు..!


Wed,February 20, 2019 01:35 AM

kanna lakshminarayana fires on chandrababu naidu

-చంద్రబాబుపై వైసీపీ నేత జగన్ ధ్వజం
-ప్రశ్నిస్తే రైతు ప్రాణాలు తీస్తారా..?
-ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా నిలదీత
-ఏపీ సర్కార్ మెడకు చుట్టుకున్న రైతు అనుమానాస్పద మృతి ఘటన

అమరావతి: ఏపీలోని గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామ రైతు పిట్టల కోటేశ్వర్‌రావు మృతి ఘటన ప్రభు త్వం మెడకు చుట్టుకున్నది. ప్రభుత్వ పెద్దల తీరు కూడా తీవ్ర వివాదాస్పదమవుతున్నది. రైతు మరణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సర్కారు పెద్దలు, పోలీసులే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం చారిత్రక కొండవీడు కోటలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కొత్తపాలెం గ్రామ రైతు పిట్టల కోటేశ్వర్‌రావు(40) అనుమానాస్పదరీతిలో చనిపోయారు. సీఎం పర్యటన కోసం కోటేశ్వర్‌రావు పొలాన్ని ఆక్రమించి బొప్పాయి తోటను నాశనంచేయడంతో ఆయన ప్రశ్నించారు. దాం తో రైతును పోలీసులు తీవ్రంగా కొట్టారు. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని కనీసం దవాఖానకు తరలించకపోవడంతో రైతు మృతి చెం దాడనే ఆరోపణలున్నాయి.

రైతు కోటేశ్వర్‌రావును మీరే చంపారంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం హెలికాప్టర్ దిగడానికి రైతు బొప్పాయి తోటను నాశనంచేశారని, పొలంలోకి వెళ్లేందుకు యత్నించి పోలీసులు కొ ట్టిన దెబ్బలకు రైతు నేలకొరిగాడని పేర్కొన్నారు. కొన ఊపిరితో ఉన్న రైతును అక్కడే వదిలేశారని, మానవత్వం చూపాల్సిన సం దర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటని చంద్రబాబును ట్విట్టర్‌లో నిలదీశారు. సామాన్య రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీ స్తారా? అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దౌర్జన్యంచేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు.

550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles