జల్లికట్టును నిషేధిస్తే బిర్యానినీ నిషేధించాలి!Tue,January 10, 2017 02:04 AM

ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్‌లో కమల్‌హసన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై, జనవరి 9:తమిళనాడులో నిషేధించిన సంప్రదాయ జల్లికట్టు క్రీడకు ప్రముఖ నటుడు కమల్‌హసన్ మరోసారి బాసటగా నిలిచారు. జల్లికట్టుపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఒకవేళ జల్లికట్టు క్రీడపై నిషేధం విధించాలనుకుంటే దాంతోపాటు బిర్యానీపై కూడా నిషేధం విధించాలి అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
kamal-hassan
స్పెయిన్‌లో జరిగే బుల్‌ఫైట్ క్రీడలా ఈ ప్రాచీన క్రీడను అపార్థం చేసుకోవద్దని, దాంతో ఈ క్రీడను ముడిపెట్టవద్దని సూచించారు. స్పెయిన్‌లో నిర్వహించే క్రీడలో పశువులను గాయపరచడం వల్ల కొన్ని సందర్భాల్లో అవి చనిపోతాయని అన్నారు. అయితే తమిళనాడులో ఎద్దులను భగవంతుడిలా పూజిస్తారని, కుటుంబంలో ఒకరిగా ప్రేమిస్తారని తెలిపారు. ఈ క్రీడ ముఖ్య ఉద్దేశం ఎడ్లను లొంగదీసుకోవడమే. అంతేకాని వాటి కొమ్ములను విరవడం, ఇతర అవయవాలను గాయపరచడం కాదని స్పష్టం చేశారు. సోమవారం చెన్నైలో జరుగుతున్న ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ సంప్రదాయ జల్లికట్టు క్రీడ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ క్రీడకు బిగ్ ఫ్యాన్ అని పేర్కొన్నారు. దక్షిణాది నటుల్లో జల్లికట్టు ఆడిన అతికొద్ది మంది తాను ఒకడినని, ఇది మా సంస్కృతి అని చెప్పుకోవడానికి తమిళుడిగా గర్వపడుతానని ఆయన అన్నారు. గతంలో కూడా పలుమార్లు జల్లికట్టు క్రీడను సమర్థించారు. తమిళనాడులో జల్లికట్టును నిషేధిస్తూ 2014లో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే గతేడాది ఈ నిషేధాన్ని ఎత్తివేయాలంటూ చేసిన అభ్యర్థనలను దేశ అత్యున్నత కోర్టు తోసిపుచ్చింది.

1102
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS