జయాబచ్చన్ ఒక డ్యాన్సర్!Tue,March 13, 2018 01:13 AM

-బీజేపీలో చేరిన నరేశ్ అగర్వాల్ అనుచిత వ్యాఖ్యలు
-ఖండించిన సుష్మాస్వరాజ్, బీజేపీ నేతలు

Naresh-Agarwal
న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ నరేశ్ అగర్వాల్ సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఫిల్మీవాలీ.. డ్యాన్సర్ అని ఎంపీ జయాబచ్చన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జయాబచ్చన్‌తోపాటు అగర్వాల్ ఇప్పటివరకు ఒకే పార్టీవారే. గతంలో వారు ఎస్పీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వారి రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌లో 2తో ముగియనున్నది. ఈ దఫా ఎస్పీ.. జయకు మళ్లీ అవకాశమిచ్చింది. ఆమె వల్లే తనకు అవకాశం రాలేదని అగర్వాల్ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడంతోనే జయపై అక్కసు వెళ్లగక్కారు. సినిమాల్లో పని చేసిన ఒకావిడ వల్ల నాకు అవకాశం పోయింది. ఆమె సినిమాల్లో డ్యాన్సులు చేసేది, నటించేది.. నాకు టిక్కెట్ నిరాకరించారు. అది నాకు నచ్చలేదు అని అన్నారు. ఆయన వ్యాఖ్యలను విదే శాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తప్పుపట్టారు. నరేశ్‌ను మా పార్టీలోకి స్వాగతిస్తున్నా. జయపై ఆయన వ్యా ఖ్యలు సముచితమైనవి, ఆమోదయోగ్యం కావు అని ట్వీట్ చేశారు. అగర్వాల్ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి నంబిత్ పాత్ర ఖండించారు.

585

More News

VIRAL NEWS