Telangana Intermediate 1st & 2nd Year Results 2019

కశ్మీర్ కథలో కొత్త మలుపులు ఉండవేమో!


Wed,March 20, 2019 03:00 AM

Jammu and Kashmir is the only Muslim majority in the country

ప్రధానంగా జమ్ముకే బీజేపీ పరిమితం. లోయలో బీజేపీ పోటీచేయడం అనేది దశాబ్దం క్రితం వరకు అనూహ్యమైన విషయం. ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే కల్లోమాట అన్నట్టుగా ఉండేది. సంకీర్ణంతో ఆ మెట్టు అధిగమించినప్పటికీ ఇప్పుడు సొంతంగా లోయలోకి అడుగు పెడుతున్నది.

దేశంలో ముస్లిం మెజారిటీ రాష్ట్రం జమ్ముకశ్మీర్ ఒక్కటే. మూడు ప్రాంతాలుగా విడిపో యి ఉంటుంది. జమ్ములో హిందువులు అధికం. కశ్మీర్‌లోయలో ముస్లింలు అత్యధికం. లద్దఖ్‌లో బౌద్ధులు ఎక్కువ. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జమ్ములోని రెండు స్థానాలు, లద్దఖ్‌లోని ఒకస్థానం బీజేపీ గెల్చుకుంది. కశ్మీర్‌లోయలోని మూడు స్థానాలు ముస్లింపార్టీలే గెల్చుకున్నాయి. బారాముల్లాలో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీకి చెందిన ముజఫర్ హుసేన్ బేగ్ గెలిచారు. శ్రీనగర్‌లో పీడీపీ తరఫున పోటీచేసిన తారిక్ హమీద్ కారా గెలిచారు. కానీ 2016లో రాజీనామా చేశారు. ఆస్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా గెలుపొందారు. అనంతనాగ్ నుంచి మెహబూబా గెలిచారు. కానీ 2016 ఏప్రిల్ 4న రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉండిపోయింది. బీజేపీ తరఫున లద్దఖ్‌లో తుప్‌స్తాన్ చెవాంగ్, ఉధంపూర్‌లో జితేంద్రసింగ్, జమ్ము నుంచి జుగల్ కిశోర్ గెలుపొందారు.

ఇలా ముస్లిం పార్టీలతో చెరిసగంగా ఉన్న బీజేపీ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో మొత్తం ఆరు స్థానాలకు పోటీ చేస్తున్నది. పీడీపీ, కాన్ఫరెన్స్ మధ్య ఓట్ల చీలికతో లబ్ధి పొందాలన్నది దీని వెనుకగల ఆలోచన అని వేరే చెప్పక్కర్లేదు. ఇటు మెహబూబా, అటు అబ్దుల్లాలు పోటాపోటీగా ర్యాలీలు జరుపుతూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. భద్రతా కారణాల రీత్యా జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగడం లేదు. ఇటీవల జరిగిన హింసాకాండను కేంద్రం ఇందుకు కారణంగా చూపడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. 1996 తర్వాత గడువు ప్రకారం అసెంబ్లీకి ఎన్నికలు జరుగకపోవడం ఇదే ప్రథమం. పోయిన నవంబర్‌లో బీజేపీ మద్దతు ఉపసంహరణతో మెహబూబా ముఫ్తి ప్రభుత్వం పడిపోయిన తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీని రద్దుచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జమ్ము ప్రాంతంలోని 25 స్థానాలను గెల్చుకున్నది. 2015 మార్చిలో పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి బీజేపీ దూకుడు పెంచింది.

కశ్మీర్ లోయలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు బీజేపీ ఎన్నడూ గెల్చుకోలేదు. లద్దఖ్ పార్లమెంట్ స్థానం గెల్చుకున్నప్పటికీ అసెంబ్లీ స్థానాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. కాకపోతే ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో కమలం బలం పెరిగింది. దీంతో ధైర్యం హెచ్చినట్టుంది. కశ్మీర్‌లోయలో బీజేపీ ఓట్లశాతం చాలాతక్కువ (2.2 శాతం). ఇప్పుడది మెరుగుపడుతుందా? అనేది చెప్పలేం. పీడీపీ, కాన్ఫరెన్స్ మధ్య ఓట్లు చీలితే లబ్ధిపొందడం సులువే. కానీ కాంగ్రెస్ ఓట్ల శాతం బీజేపీ కంటే ఎక్కువ. అయినా ఏం లాభం? సొంతంగా గెలువగలిగే స్థితిలో ఆపార్టీ లేదు. ప్రధానపక్షాలు అభ్యర్థులను ఎంపికచేసే పనిలో బిజీగా ఉన్నాయి. పార్టీల బలాబలాల్లో పెద్దగా మార్పులేవీ లేవు. దీంతో కొంచెం అటూఇటుగా గత ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని పరిశీలకుల అంచనా.

పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ అంటే ఇదేనా?

JammuKashmir1
అత్తమీద కోపం దుత్తమీద చూపెట్టడం.. రాజకీయాల్లోనూ కనిపిస్తుంటుంది. తాజాగా ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు అలాంటి దుత్త బెదిరింపులకు పాల్పడి కొడుకులా తానూ పప్పులో కాలేశాడు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని.. ప్రపంచ నాయకుడిని అని చెప్పుకునే బాబుగారు.. ఒంగోలు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. బీహార్ బందిపోటు ప్రశాంత్ కిశోర్ ఏపీలో లక్షలాది ఓట్లను తొలగించారు అనేశారు. ఆ మాటల ఉద్దేశం ఏంటో అర్థంకాక జనాలు నెత్తినోరు బాదుకుంటున్నారు. పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించారు. సరే.. ఆయన గురించి ఎవరికి తెలియదు? జనాలు లైట్ తీసుకొని ఊరుకున్నారు. కానీ సదరు ప్రశాంత్ కిశోర్ మాత్రం దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. ఓటమి ఖాయం అని స్పష్టమవ్వడం ఎంతటి రాజకీయ నాయకుడినైనా దెబ్బతీస్తుంది. చంద్రబాబు మాటలు నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. అయ్యా బాబుగారూ.. మీరు బీహార్‌ను కించపరిచేలా దుర్భాషలాడటం కన్నా.. ఏపీ ప్రజలు మీకు ఎందుకు ఓటెయ్యాలో ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుంది అన్నారు. నెటిజన్లు కూడా స్పందిస్తూ.. అనాలి అనుకుంటే ప్రత్యక్షంగా జగన్‌ను అనండి.. లేదంటే ప్రశాంత్ కిశోర్ పార్టీ పరంగా మీకేమైనా హాని చేస్తే ఆయన్ను అనండి.. కానీ నలభైయేండ్ల ఉత్తమ నాయకుడిని అని చెప్పుకునే మీరు ఇంత చీప్‌గా మాట్లాడితే.. మీకూ.. మీ పుత్రరత్నానికి తేడా ఏముంది బాబూ? అంటూ సెటైర్లు విసురుతున్నారు!

396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles