వెలకట్టలేని రత్నం.. జైట్లీ


Wed,September 11, 2019 02:05 AM

Jaitleys life inspires us to work harder PM Modi

- సంస్మరణ సభలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ వెలకట్టలేని రత్నం అని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. దేశం కోసం మరింత కష్టపడేందుకు జైట్లీ జీవితం తమకు స్ఫూర్తినిస్తున్నదని పేర్కొన్నారు. తన ఆత్మీయ మిత్రుడు లేని లోటు తనకు ప్రతిక్షణం కనిపిస్తున్నదని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన జైట్లీ సంస్మరణ సభలో మోదీ మాట్లాడారు. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ముఖ్యమైన పత్రాలను రూపొందించేందుకు అద్వానీ లేదా జైట్లీ వైపే పార్టీ చూసేదన్నారు. విదేశీ పర్యటనలో ఉండడంతో జైట్లీకి నివాళులు అర్పించలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు మాట్లాడారు.

354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles