ఐఏఎస్ ఇంట్లో రూ.10 కోట్లు, 10 కేజీల గోల్డ్!

Fri,April 21, 2017 01:33 AM

money
న్యూఢిల్లీ: నోయిడాలోని ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కేశవ్‌లాల్ ఇండ్లపై గురువారం ఆదాయం పన్నుశాఖ అధికారులు దాడి చేశారు. భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేశవ్‌లాల్ కాన్పూర్ పరిధిలో అమ్మకం పన్ను విభాగంలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో నోయిడా ప్రాధికార సంస్థ ఓఎస్డీగా పనిచేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేశవ్‌లాల్‌కు సంబంధించిన నాలుగు ఇండ్లపై ఆదాయం పన్ను అధికారులు దాడులు చేశారు. 10 కోట్ల నగదు, 10 కేజీల బంగారం, కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నతాధికారి తెలిపారు. గత మూడు రోజులుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లోని ఐఏఎస్ అధికారుల ఇండ్లల్లో ఆదాయం పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

2606

More News

మరిన్ని వార్తలు...