వైద్యరంగంలో పెట్టుబడులు పెరుగాలిMon,June 19, 2017 02:02 AM

-రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ

Pranab
ఉడిపి(కర్ణాటక), జూన్ 18: వైద్య రంగంలో మరిన్ని పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ప్రస్తుతం ఈ రంగాన్ని మౌలిక వసతులు, సిబ్బంది కొరత వేధిస్తున్నదని, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మెడికల్ కాలేజీలు పెరుగాలని, కార్పొరెట్ సెక్టార్ సహకారం అందించాలని సూచించారు. ఆదివారం కర్ణాటకలోని ఉడుపిలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య సేవలను అందించడంతోనే సరిపోదని, ఆ వైద్య సేవలు కూడా సరసమైన ధరలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వెయ్యి జనాభాకు ఒక డాక్టర్ ఉండాలని, కానీ మన దగ్గర 1700మందికి ఒక డాక్టర్ ఉన్నారని తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని, పెజవర మఠాన్ని సందర్శించారు.

211

More News

VIRAL NEWS