నేటినుంచి ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్


Sun,January 13, 2019 02:06 AM

International Kite Festival Arrangements At Parade Ground

-ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో నాలుగో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మూడురోజులపాటు నిర్వహించే ఈ వేడుకలో 20 దేశాలనుంచి 42 మంది అంతర్జాతీయ కైట్ ైఫ్లెయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు, పెద్దసంఖ్యలో సందర్శకులు పాల్గొంటారు. అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా 22 దేశాలు, దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 1,200 రకాల స్వీట్లను అందుబాటులో ఉంచుతారు. ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు కైట్ ఫెస్టివల్‌లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఇతరశాఖల సమన్వయంతో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.
PARADE-GROUND1

ఇంటర్నేషనల్ కైట్ ైైఫ్లెయర్స్‌తో సమావేశం

బేగంపేటలోని పర్యాటకభవన్‌లో ఇంటర్నేషనల్ కైట్ ైఫ్లెయర్స్‌తో శనివారం పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సమావేశమై పలుఅంశాలపై చర్చించారు. సమావేశంలో టూరిజం ఇంచార్జి కమిషనర్ దినకర్‌బాబు, సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
PARADE-GROUND2

492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles