వర్మ చేసిన బదిలీలను రద్దుచేసిన నాగేశ్వరరావు

Sat,January 12, 2019 02:03 AM

న్యూఢిల్లీ:సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా గురువారం రాత్రి బాధ్యతలు స్వీకరించిన ఎం.నాగేశ్వరరావు... మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ గురువారం చేసిన బదిలీలను రద్దుచేస్తూ ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా అధికారులను యథావిధిగా వారి స్థానాల్లోనే నియమిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సీబీఐ అధికార ప్రతినిధి, ముఖ్య సమాచార అధికారిగా సీనియర్ ఐఐఎస్ ఆఫీసర్ నితిన్ వాకంకర్‌ను నియమించారు. గతంలో ఈ స్థానంలో ఉన్న అభిషేక్ దయాల్‌ను పబ్లికేషన్స్ విభాగానికి బదిలీ చేశారు. సంయుక్త డైరెక్టర్ స్థాయిలోని నలుగురు అధికారులను కూడా ఆయన బదిలీ చేశారు.

1148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles