ఫిబ్రవరి 1న తాత్కాలిక కేంద్ర బడ్జెట్!


Thu,January 10, 2019 02:29 AM

Interim Budget 2019 on 1 February

-ఈ నెల 31 నుంచి వచ్చేనెల 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారీగా తాయిలాలను ప్రకటించనున్న మోదీ సర్కార్?

న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్-మేనెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది. సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటాయి. మోదీ ప్రభుత్వం కూడా ఈ నెల 31 నుంచి వచ్చేనెల 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించి, ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు ముగియగానే ప్రస్తుత పార్లమెంట్ పదవీకాలం కూడా పూర్తయినట్లే లెక్క. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 31న ప్రసంగిస్తారు. అదే రోజు ఆర్థిక సర్వే నివేదికను కూడా ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతుంటాయి. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకే విడతగా సమావేశాలు ముగించి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడం, త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో భారీగా తాయిలాలను ప్రకటించడానికి మోదీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.

318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles