ప్రధాని చైర్మన్‌గా అంతర్రాష్ట్ర మండలి పునరుద్ధరణ


Thu,August 15, 2019 12:56 AM

Inter State Council reconstituted with Prime Minister as chairman

న్యూఢిల్లీ, ఆగస్ట్ 14: రాష్ర్టాల మధ్య ఏర్పడే వివాదాలపై దర్యాప్తు జరిపి, పరిష్కారానికి సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన అంతర్రాష్ట్ర మండలిని (ఇంటర్ స్టేట్ కౌన్సిల్) కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి ప్రధానమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆరుగురు కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్రసింగ్ తోమర్, తావర్ చంద్ గెహ్లాట్, హర్దీప్ సింగ్ పూరీని ఈ మండలిలో సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు అన్ని రాష్ర్టాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారి సభ్యులుగా వ్యవహరిస్తారు. మరో పది మంది కేంద్ర మంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.

121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles