జవాన్లకు నాసిరకం ఆహారంTue,January 10, 2017 01:26 AM

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో భారత్, పాక్ సరిహద్దుల వెంబడి సేవలందిస్తున్న సైనిక దళాలకు నాసిరకమైన ఆహారాన్ని అందిస్తున్నారని, దాంతో కొన్నిసార్లు కాలే కడుపుతోనే విధులను నిర్వహించాల్సి వస్తున్నదని ఓ బీఎస్‌ఎఫ్ జవాను ఆరోపించారు. సరిహద్దులో సరైన ఆహారం అందక జవాన్లు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుల కోసం ప్రభుత్వం సమకూర్చిన నిత్యావసర వస్తువులను ఉన్నతాధికారులు బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొంటున్నారని, అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, దాంతో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. బీఎస్‌ఎఫ్ 29వ బెటాలియన్‌కు చెందిన టీబీ యాదవ్ (40) సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రంగా స్పందించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

623
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS