రక్తమోడుతున్నా రక్షించని అలసత్వం


Thu,July 12, 2018 07:35 AM

Indias selfie obsession hits new low as man takes picture in front of dying road accident victims

-ప్రమాదానికి గురైన వారితో సెల్ఫీలు..
-ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో ఘటన

జైపూర్, జూలై 11: ప్రమాదానికి గురైన వారికి సాయం అందించాల్సింది పోయి.. వారి ఆర్తనాదాలను మొబైల్ ఫోన్లలో బంధించేందుకు ప్రయత్నించిన అమానవీయ ఘటన రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో చోటుచేసుకున్నది. చావుబతుకుల్లో ఉన్నవారిని రక్షించడం కన్నా సెల్ఫీలు తీసుకోవడమే ముఖ్యమన్నట్టుగా ప్రవర్తించిన బాటసారులు వారి మరణానికి పరోక్షంగా కారకులయ్యారు. గుజరాత్‌కు చెందిన పర్మానంద్ , చందారాం, జెమారాం లేబర్ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తీసుకెళ్లేందుకు వారు ముగ్గురు బర్మార్ జిల్లాకు రెండ్రోజుల క్రితం వచ్చారు. బైక్‌పై ప్రయాణిస్తున్న వీరిని ఓ పాఠశాల బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. దవాఖానకు తీసుకెళ్లండంటూ రోడ్డుపై వెళ్తున్న వారిని వేడుకున్నా ఫలితం లేకపోయింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారిని వీడియోలు తీస్తూ సెల్ఫీలు తీసుకుంటూ గడిపారే తప్పా ఎవరూ వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు. దాంతో ముగ్గురు వ్యక్తులు అక్కడే ప్రాణాలు వదిలారు. తీవ్రంగా గాయపడిన వారిని రక్షించకుండా సెల్ఫీలు తీసుకునేందుకు స్థానికులు పోటీపడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2664
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles