స్వలింగ వివాహాలకు కేంద్రం ససేమిరా!


Sun,September 9, 2018 02:24 AM

Indias government pushes back against calls for same sex marriage

-ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వం అంగీకరించదన్న ఓ ఉన్నతాధికారి
-377 సెక్షన్ రద్దు విషయాన్ని సుప్రీంకోర్టుకు వదిలేసిన కేంద్రం
-వివాహం, ఇతర హక్కులపై మాత్రం కఠిన వైఖరి

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కా న్ని నేరంగా పేర్కొనే ఐపీసీ సెక్షన్ 377 రద్దుపై చూసీచూడనట్టుగా వ్యవహరించిన కేంద్రం స్వలింగ వివాహాలపై మాత్రం కఠిన వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. సెక్షన్ 377ను రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించిగానే.. తదుపరి తమహక్కుల కోసం పోరుసాగిస్తామని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ (ఎల్జీబీటీక్యూ) వర్గాల ప్రతినిధులు ప్రకటించారు. సెక్షన్ 377 భవితవ్యాన్ని సుప్రీంకోర్టుకే వదిలేసిన కేంద్రం.. స్వలింగ వివాహానికి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది భావిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు స్వలింగ మేజర్లు పరస్పర అంగీకార శృంగారంలో పాల్గొనడం నేరం కాదంటే ఒప్పుకుంటాం. కానీ స్వలింగ వివాహాల చట్టబద్ధానికి ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వం అంగీకరించబోదు అని కేంద్రంలోని ఓ సీనియర్ అధికారి తెలిపా రు. కాగా, అధికార బీజేపీకి సైద్ధాంతిక మార్గదర్శకత్వాన్ని అందించే ఆర్‌ఎస్‌ఎస్ కూడా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. స్వలింగ వివాహాలు ప్రకృతి నియమాలకు వ్యతిరేకం. వాటిని మేం అంగీకరించం అని ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. మరోవైపు సెక్షన్ 377 రద్దును స్వాగతించిన కాంగ్రెస్ పార్టీ కూడా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసే అంశంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు.

710
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles