నైజీరియాలో భారతీయుల కిడ్నాప్

Thu,December 5, 2019 12:52 AM

న్యూఢిల్లీ: హాంకాంగ్‌కు వెళుతున్న ఆ దేశ నౌకలో ప్రయాణిస్తున్న 18 మంది భారతీయులను నైజీరియా కోస్తాకు సమీపాన సముద్ర దొంగలు కిడ్నాప్ చేశారు. ఈ సంగతి తెలిసిన వెంటనే నైజీరియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరిపారు. సముద్ర దొంగలు కిడ్నాప్ చేసిన భారతీయుల సమాచారం తెలుసుకోవడంతోపాటు వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఆర్‌ఎక్స్ మారిటైమ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల మూడో తేదీ సాయంత్రం హాంకాంగ్‌కు చెందిన వీఎల్‌సీసీ, నేవ్ కన్టెలేషన్ నౌకను సముద్ర దొంగలు తమ ఆధీనంలోకి తీసుకుని 19 మందిని కిడ్నాప్ చేశారు. వారిలో 18 మంది భారతీయులు ఉన్నారని ఏఆర్‌ఎక్స్ పేర్కొంది.

231
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles