కొచి: భారత నౌకాదళంలో పైలట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా సబ్-లెఫ్టినెంట్ శివాంగి రికార్డు నెలకొల్పారు. సోమవారం కేరళలోని కొచి నౌకాదళ స్థావరం వద్ద విభాగం ఉన్నతాధికారుల సమక్షంలో ఆమె స్వయంగా యుద్ధ విమానాన్ని విజయవంతంగా నడిపారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన శివాంగి.. మీడియాతో మాట్లాడుతూ విమానం పైలట్ కావాలన్నది తన చిన్ననాటి కల అని చెప్పారు. తన దీర్ఘ కాల కల సాకారం చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఐఎన్ఎస్ గరుడ యుద్ధ నౌకపై డార్నియర్ స్కాడ్‌లో భాగంగా ఆమె ఇనాస్ 550 నిఘా విమానాలను నడుపనున్నారు.