తేలికపాటి యుద్ధ ఫిరంగులను పరీక్షించిన భారత్Mon,July 17, 2017 03:06 AM

-చైనా, పాకిస్థాన్‌తో సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో ప్రాధాన్యం

న్యూఢిల్లీ: తేలికపాటి యుద్ధ ఫిరంగులను భారత సైన్యం పరీక్షించింది. రాజస్థాన్‌లోని పొఖ్రాన్‌లో ఈ పరీక్షలను చేపట్టింది. బోఫోర్స్ కుంభకోణం తర్వాత ఈ ఫిరంగులను కొనుగోలు చేయడానికి భారత్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందంలో భాగంగా ముందుగా రెండు ఫిరంగులు భారత్ చేరుకున్నాయి. వీటి సామర్థ్యం, పనితీరు తదితర విషయాలను పరిశీలించడానికి భారత సైన్యం పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలు సెప్టెంబర్ వరకు కొనసాగే అవకాశమున్నది. చైనా, పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో వీటిని పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. చైనా సరిహద్దులోని సిక్కిం సెక్టార్‌లో ఈ ఫిరంగులను మోహరించే అవకాశమున్నదని తెలుస్తున్నది. 2018 సెప్టెంబర్‌లోపు మరో మూడు ఫిరంగులను సైన్యానికి అప్పగించాలని నిర్ణయించామని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 145 ఫిరంగుల కొనుగోలుకు భారత్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరిందని, దీని కోసం దాదాపు రూ.5000కోట్లు ఖర్చు కానున్నాయని వివరించాయి.
Howitzer-Guns

370

More News

VIRAL NEWS