2030 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్


Tue,February 12, 2019 02:34 AM

India Likely to Become Second Largest Economy by 2030

-చైనా ఫస్ట్.. మూడో స్థానానికి అమెరికా
-పెట్రో టెక్ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

గ్రేటర్ నోయిడా, ఫిబ్రవరి 11: ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆరో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. 2030 నాటికి ద్వితీయ స్థానానికి ఎదుగుతుందని ఇటీవలి స్టాండర్డ్ చార్టర్డ్ నివేదిక పేర్కొన్నదని ప్రధాని మోదీ చెప్పారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా నిలుస్తుందని, రెండోస్థానాన్ని భారత్ ఆక్రమిస్తే.. అమెరికా మూడో స్థానానికి పరిమితం అవుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ నివేదిక తెలిపిందని సోమవారం పెట్రోటెక్-2019 సదస్సును ప్రారంభిస్తూ ప్రధాని చెప్పారు. ప్రస్తుతం ఇంధన వినియోగంలో భారత్ మూడో స్థానంలో నిలిచిందని, ఏటా ఇంధన డిమాండ్ ఐదుశాతానికి పైగా పెరుగుతున్నదన్నారు. మున్ముందు ఇంధన సంస్థలకు భారత్ ఆకర్షణీయమైన మార్కెట్‌గా నిలుస్తుందని, 2040 నాటికి ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుందని తెలిపారు.

దేశ ప్రగతిలో ఇంధన రంగం కీలక భూమిక పోషించనున్నదన్నారు. తమ ప్రభుత్వం గత ఐదేండ్లలో ముడి చమురు, సహజవాయువు రంగాల్లో పలు సంస్కరణలు అమలు చేసిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి చేపట్టేందుకు అవసరమైన పద్ధతులను విస్తరించామన్నారు. అయితే ముడి చమురు ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాలను సమతుల్యం చేసేలా దాని ధరను నిర్ణయించాలని సూచించారు. తమ ప్రభుత్వం బయో ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నదని, 11 రాష్ర్టాల్లో 12 ద్వితీయ శ్రేణి బయో రిఫైనరీలను స్థాపించినట్లు ప్రధాని మోదీ చెప్పారు.

633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles